

జనం న్యూస్- జూన్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ విజయపురి టౌన్ ఎస్ఐగా జి ముత్తయ్య ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు.గతంలో విజయపురి టౌన్ ఎస్సైగా పనిచేసిన సంపత్ గౌడ్ నల్లగొండ వి ఆర్ కు వెళ్లగా హుజూర్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై జి ముత్తయ్య బదిలీపై విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ మరియు స్టేషన్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.