

జనం న్యూస్,జూన్23,
అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం, పూడిమడక గ్రామానికి చెందిన ప్రభుత్వ భూముల యొక్క కంపార్టుమెంట్ నెం.1&2 (ఎ,124) సర్వే నెంబర్లు 50-1,51 నుంచి55,62, 56/1,74/2, 82 మరియు 83 పాత సర్వే నెంబర్లు 21,26-బి1, 27 నుండి 3 2 9/29/13, 3పి డి నోటిఫై చేసి ప్రభుత్వం స్వాధీనపరుచుకోమనిస్పందనలో మరియు చీఫ్ కమీషనర్ ల్యాండ్ & అడ్మినిస్ట్రేషన్,ఎ.పి. విజయవాడ వారికి 23-07-2020,18-09-20,13-09-2021,11-07-2022న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగిందని, అప్పట్లో అచ్యుతాపురం తహసీల్దారు ఇంకా ఎంక్వైరీలో ఉందని చెప్పడం జరిగిందని, పూడిమడక గ్రామాన్ని అనుకొనియున్న సుమారు 50 ఎకరాల భూమిని యలమంచిలి మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు (కన్నబాబు) ప్రభుత్వ భూమిని అక్రమంగా కొనుగోలు చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డబ్ల్యూ.పి.నెం 620/1917, తేదీ.16-06-197 ఆర్డరును మభ్య పెట్టి యు.వి. సుకుమార్ వర్మ మరియు అతని భార్య రాధాదేవి పేరున అప్పట్లో తహసీల్దార్ ను మభ్యపెట్టి పాస్ పుస్తకాలు జారీ చేయించుకున్నారని, ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి రికార్డులు అచ్యుతాపురం తహసీల్దారుకి సమర్పించియున్నామని, సుమారు 3 సంవత్సరాలు పైగా అవుతున్నా అచ్యుతాపురం తహసీల్దార్ గానీ, అనకాపల్లి ఆర్డీవో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని,భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనపర్చుకొని పూడిమడక గ్రామానికి చెందిన నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేపట్టాలని లేదా మా గ్రామ అవసరాలకోసం ఉపయోగపడేలా చేస్తారని ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పిజిఆర్ఎస్ లో మత్స్యకార నాయకులు వాసుపల్లి అప్పారావు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు చేసిన వారిలో ధోని కాసుబాబు,ఏరిపల్లి కృష్ణ,మేరుగు రమణబాబు తదితరులు ఉన్నారు.