

(జనం న్యూస్ జూన్ 23భీమారంమండల ప్రతినిధి కాసిపేట రవి )
యువకులు,ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భీమారం మండల ఎస్ ఐ కే శ్వేత మండలంలో ని యువతకు, విద్యార్థులకు సోమవారం రోజున హరితహారం లో భాగంగా పర్యావరణం గురించి .మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని .మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకోవద్దు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురి కాకుండా చూడాలన్నారు.సరదాగా మత్తు పదార్థాలను అలవాటు చేసుకొని బానిసలుగా మారుతున్నారని పిల్లల నడవడిక పై తల్లిదండ్రులు దృష్టి సారించాలని.మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలి.యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని .నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న ఈ విషయన్ని గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యుల సత్సంబంధాలుకు దూరమవుతారని. చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని సూచించారు.మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా దానిని ఆదిలోనే తుంచి వేయాలని కోరారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మాచర్ల పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు