Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు

ఎస్టీయూ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించినందున ఆగస్టు లోపు పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల స్థానంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన కోరుతున్నామని అన్నారు.స్థానిక చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ మే నెలలో జరిగిన పదోన్నతులలో మే నెల కర వరకు ఆయన ఖాళీలలో సీనియర్ ఉపాధ్యాయులకు 13 కల్పించాలని కానీ డీఎస్సీ నియామకానికి ముందు ఆగస్టు వరకు ఉన్న వేకెన్సీ లన్నీ పద్దెనిమితుల కల్పించాలని కోరారు లేనిచో సీనియర్ ఉపాధ్యాయులు డీఎస్సీ వారి కంటే జూనియర్గా మారే ప్రమాదం ఉందని తెలిపారుఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలు లేక కొంతమంది సీనియర్ ఉపాధ్యాయులు క్లస్టర్ వేకెన్సీ లో కోరుకున్నారు కావున డీఎస్సీ నియామకాలకు ముందు సీనియర్ ఉపాధ్యాయులకు పాఠశాలలో స్థానం కల్పించి డీఎస్సీ ఉపాధ్యాయులను క్లస్టర్ వేకెన్సీ లో నియమించాల్సిందిగా తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా బదిలీ లేక ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు శాంక్షన్ పోస్ట్ లోనే చేరినందున జీతాలు ఎటువంటి ఆగటం కూడా లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.ఎస్ టి యు పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య ఎస్ టి యు పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వి జయప్రకాష్ నాదెండ్ల మండల అధ్యక్షుడు మక్బూల్ బాషా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ ఎడ్లపాడు మండల అధ్యక్షుడు జి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ చిలకలూరిపేట మండల అధ్యక్షులు బొంత రవి చిలకలూరిపేట మండల ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్వలి ఎస్టియు సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు జిల్లా మహిళా కన్వీనర్ ఎం శారద తదితరులు మే నెలలో నిర్వహించిన పదోన్నతులు బదిలీలు సజావుగా ఉపాధ్యాయులు కోరుకున్న విధంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్వహించడం పట్లహర్షం వ్యక్తం చేశారు