

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
జనం న్యూస్ జూన్ 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆభరణాలు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలంపిక్ డే రన్ ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతూ పాటు క్రీడలలో కూడా రాణించాలని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, చదువులో ఏకాగ్రత పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు ఆర్థిక ఉన్న క్రీడను ఎంచుకొని చదువు తో పాటు రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఒలంపిక్ డే రన్ ర్యాలీ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్క్, కొమురం భీం చౌక్, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా సాగింది కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా సర్వీసులు శాఖ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, జిల్లా గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
