Listen to this article

సమాజంలో ఉన్న రుగ్మతల పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి.

డ్రగ్స్, గంజాయి ప్రమాదకరమైన అలాంటి వాటిని సమాజం నుండి తొలగించాలి.

సీఐ రామకృష్ణా రెడ్డి మునగాల సర్కిల్

జనం న్యూస్ జూన్ 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

మాదకద్రవ్యాల నివారణ వారోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిది మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది.దీనిలో భాగంగా మునగాల పోలీస్ స్టేషన్ సిబ్బంది బరాఖతగూడెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని వ్యసనాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న మంచి చెడు పై అవగాహన కలిగి ఉండాలి,సమాజంలో ఉన్న రుగ్మతల రుపుమాపడంలో విద్యార్థులు పాత్ర ఉన్నది అన్నారు.ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి గంజాయి,డ్రగ్స్ లాంటి వారికి దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయించారు.డ్రగ్స్, గంజాయి ప్రమాదకరమైన అలాంటి వాటిని సమాజం నుండి తొలగించాలి అన్నారు.