

జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐ.పి.ఎస్
నేటి నుండి ప్రతి సోమవారం, గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో
మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి పాఠశాల, కళాశాల విద్యార్థులకు,
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గ్రామపంచాయితీలో అవగాహన కార్యక్రమాల నిర్వహణ
మారకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత.
యువత, ప్రజలు డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు
జనం న్యూస్ జూన్ 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు యువత పోలీస్ శాఖకు, ఇతర శాఖలకు సహకరించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ గారు పేర్కొన్నారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి వివరాలు వెల్లడిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. యువత ప్రజలు గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల వ్యక్తిగతంగా నే కాకుండా కుటుంబం సమాజం మరియు దేశం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు, గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పభావాలపై ఆయా పోలీస్ స్టేషన్స్ లో సబ్ ఇన్స్పెక్టర్స్, సర్కిల్స్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్, జిల్లా కళాబృందం, జిల్లా షీ టీమ్స్ జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాల కళాశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగి నష్టాల గురించి విద్యార్థులకు ఎస్సైలు, సీఐల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా చెడు వ్యసనాలకు లేదా డ్రగ్స్ కి అలవాటు పడితే వెంటనే 1908 లేదా 8712670551 నెంబర్ కి సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.