

జనం న్యూస్ 24 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
సారిపల్లి టిడ్కో గృహ నిర్మాణాల ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పనలో భాగంగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సోమవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు రహదారి నిర్మాణం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ… గృహ నిర్మాణాలు చేపట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్న రహదారి మాత్రం వేయలేదన్నారు.