Listen to this article

(జనం న్యూస్ 24 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ మంగళవారం రోజున , భీమారం మండల పొలంపల్లి శివారు లోని మాంతమ్మ దేవాలయం వద్ద ఆషాడమాసం లో జరిగే పూజల నిమిత్తం భీమారం మండలమే కాకుండా చెన్నూర్ , జైపూర్ ,శ్రీరాంపూర్ ,మంచిర్యాల ,మందమర్రి,అవడం మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు .ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు , మెండే మల్లేష్ యాదవ్, తోట శ్రీరాములు , కుర్సింగ సత్యక్క కార్యకర్తలు పాల్గొన్నారు.