Listen to this article

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయం

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ట్కర్….

బిచ్కుంద జూన్ 24 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లో మంగళవారం నాడు బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో 11వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బిచ్కుంద పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 130ఇండ్లు మంజూరుకాగా అందులో మంగళవారం మంచి రోజు కావడంతో రెండు ఇందిరమ్మ ఇండ్ల కు ముగ్గు పోసి పనులు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ బిచ్కుంద పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 130 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 52 ఇండ్లు ప్రారంభించడం జరిగింది అని అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు . ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, నౌషా నాయక్, తుకారం, బొగడ మీద సాయిలు మైనార్టీ నాయకుడు గౌస్ , సీమ గంగారం , చింతల్ హనుమాన్లు , శంకర్, బస్వంత్ తదితరులు పాల్గొన్నారు.