

TSUTF — జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 24 :
టియస్ యుటిఎఫ్ ఏన్కూర్ మండల శాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంఘ సభ్యత్వం,జనరల్ ఫండ్ క్యాంపెయిన్ ను మండలంలో ఎంతో ఉత్సాహంగా రెండు రోజులు నిర్వహించామని జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు పేర్కొన్నారు.మొదటి రోజు సోమవారం ఏన్కూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జన్నారం, జన్నారం పిఎస్, జన్నారం ఎస్సి, ఎస్టి కోనయపాలెం,ఎంపీపీ టిఎల్ పేట, ఎస్టి కాలనీ కేసుపల్లి, యుపిఎస్ కేసుపల్లి, పియస్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బురద రాఘవాపురం,కోదండరామపురం, పిఎస్ లచ్చగూడెం, యుపిఎస్ శ్రీరామ్ గిరి, ఎంపీపీఎస్ రాజ లింగాల, సూర్య తండ, జిపిఎస్ మర్సకుంట, యుపిఎస్ రాయమాదారం, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం.రెండవ రోజు మంగళవారం గార్లఒడ్డు, హరిజన కాలనీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర, బాలికల పాఠశాల ఏన్కూర్,కేజీబీవీ ఏన్కూర్ తదితర పాఠశాలల్లో బియన్ తండ రాజులపాలెం ఉపాధ్యాయులందరినీ కలుసుకొని సంఘ సభ్యత్వం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ క్యాంపెయిన్ లో పాల్గొన్న జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి టీఎస్ యుటిఎఫ్ ఎంతో కృషి చేసిందని, భవిష్యత్తులో కూడా విద్యారంగ అభివృద్ధిలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలనే అభివృద్ధి చేసి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, CPS ను రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని తీసుకురావాలని, ఉపాధ్యాయల సప్లమెంటరీ బిల్లులను వేంటనే క్లియర్ చేయాలని,కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలానికి జీతాలు వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారికి మినిమం టైమ్స్ స్కేలు అందించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిట్స్, పీఈటి పోస్టులు ఆఫ్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని, సిఆర్టిలకు మినిమం టైమ్స్ ఇస్తూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారి సర్వీస్ ని రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని, పిఆర్సీ తదితర సమస్యల పరిష్కారానికి టీఎస్ యుటిఎఫ్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు బి. రాంచంద్, ఎం.పుల్లయ్య, ఉపాధ్యక్షులు జె.పుల్లయ్య, కోశాధికారి బి.నరసింహరావు, శంకర్రావు, విజయశ్రీ, చంద్రప్రకాష్, ఎం నాగేశ్వరరావు, శ్రీదేవి, రమణమ్మ బి.శ్యాం కుమార్, యస్.కే.ఆలీ,బి.హతీరాం, బి.నర్సింహారావు, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.