Listen to this article

జనం న్యూస్, జూన్ 25, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )


శ్రీ సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్ విద్యార్థులు కిక్‌బాక్సింగ్ పోటీలలో ప్రతిభ చూపుతూ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో భవానీ 2 బంగారు పతకాలు, 1 రజత పతకం, అధిరాజ్ 1 బంగారు పతకం, అఖిల 1 బంగారు పతకం గెలుచుకున్నారు.వీరు ఈ నెల 28, 29 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాజమౌళి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, పట్టుదల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, రాష్ట్ర స్థాయిలోనూ మెరిసే స్థాయిలో ప్రదర్శన ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థులను అభినందించిన పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.