

జనం న్యూస్ జూన్ 24 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి
శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ విజయశాంతి జన్మదిన వేడుకలు మంగళవారం వారి నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు కోటగడ్డ శ్రీనివాస్, పంతం వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ విజయశాంతిని వారి నివాసంలో కలిసి పూల బొకే అందించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో, మరింత ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.