Listen to this article

జనంన్యూస్. 24.నిజామాబాదు

ప్రతినిధి.

వచ్చే 6 నెలలలో ప్లాన్ అఫ్ యాక్షన్ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలిలాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలిసైబర్ క్రైమ్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలినెల వారి సమీక్ష సమావేశం లో నిజామాబాదు డివిజన్ అధికారులకు పలు సూచనలు చేసిన : పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., నేడు పోలీస్ కార్యాలయంలో కమిషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత నిజామాబాదు డివిజన్ ఎ.సి.పి , సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు* మరియు ఎస్.ఐలతో సమీక్ష సమావేశం*” *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్*., ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేడు పోలీస్ కార్యాలయంలో నిజామాబాదు డివిజన్ అధికారులతో సమావేశం అయ్యారు. *ఈ సందర్భంగా ఈ దిగువ తెలిపిన విషయాలు చర్చించినారు*.*1.వచ్చే ఆరు నెలల లో ప్రతి ఎస్ హెచ్ ఓ లక్ష్యాలు పెట్టుకొని నేరాల నియంత్రణ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని ఇందులో ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ నేరాల నియంత్రణ కోసం పూర్తిగా కంట్రోల్ ఉండేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించేటట్లు సిబ్బందికి సంబంధించిన వెల్ఫేర్ మొదలగునవి ఒక ప్రణాళిక ప్రకారంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్వహించాలని**2. ప్రాపర్టీ అఫెన్సులలో ఉన్న ట్రెండ్ అర్థం చేసుకొని పాట్రోలింగ్ విధానంలో మార్పుల గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగింది.**3. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రతి ఎస్ హెచ్ ఓ అధికారికి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ చోట రోడ్డు ప్రమాదాలు జరగకుండా కావలసినటువంటి ఏర్పాట్లు చేసి, రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించాలని తెలియజేశారు.**4. పోలీస్ స్టేషన్ ల వారిగా పెండింగ్ లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది*.*5. అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాట**6. కోర్టులలో ఉన్న కేసుల త్వరితగతిన పరిష్కారానికి కృషిచేయుట**7. మహిళల భద్రతకోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని రకాల భద్రతల విషయంలో ఎల్లప్పుడు సహాకారాం అందించాలని తెలియజేశారు*.*8. ఇప్పటి వరకు జరిగిన నేరాలలో త్వరితగతిన “విచారణ” పూర్తిచేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు*.*9. సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రతీ ఒక్కరిని అప్రమత్తం చేయాలని సూచించారు*.*10. గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మెసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యాక్రమాలు నిర్వహించాలని తెలిపారు*.11. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన ” నిఘా ” ఏర్పాటు మరియు లాడ్జీలలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయడం12. పెండింగ్ లో ఉన్నఎన్. బి. డబ్ల్యూస్ల పై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటుచేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాట గురించి సూచించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులలో చాలా రోజులలో పెండింగ్లో ఉన్న ఎన్.బి.డబ్ల్యూ చేయాలన్నారు. అవసరం అయితే ఎల్.ఓ.సి లు పెట్టాలన్నారు13. సైబర్ మోసాల నియంత్రన కోసం 1930 ఫోన్ నెంబర్ గురించి ప్రజలకు అవగాహణ కల్పించాలి14. అన్ని పోలీస్ స్టేషన్ పరిదులలో ” పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బీట్ల ఏర్పాటు, రాత్రి సమయా లలో వాహనాల తనిఖీ చేసి దొంగ తనాల నివారణకు కృషి చేయుట15. ఎటువంటి చిన్న నేరాలు జరుగకుండా సంబంధిత అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో” నిఘా వ్యవస్థ పటిష్ట పర్చడము16. డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని అన్నారు ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) శ్రీ బస్వారెడ్డి , ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.ఐలు మరియు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీ శ్రీశైలం పాల్గొన్నారు.