Listen to this article

బిచ్కుంద జూన్ 24 జనం న్యూస్

రైతును రాజును చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ నాయకుడు చేయని రీతిలో ప్రజా పాలన కొనసాగిస్తున్న సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలకులకు మండల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ డెలికేట్ విట్టల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా.. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి, ఇప్పటి వరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గడచిన ప్రభుత్వంలో కొండలకు, గుట్టలకు, రహదారులకు, వెంచర్లకు, రైతుబంధు ఇచ్చేవారని, కానీ ఈ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ భూములకు ఎకరానికి 12,000 చొప్పున దిగ్విజయంగా అందించారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గేకి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి మంత్రి వర్గానికి అందరికి ధన్యవాదాలు తెలియజేశారు, . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున అప్ప పుల్కల్ సొసైటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు అనిల్ పటేల్ సీమా గంగా మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు