

జనం న్యూస్ జనవరి(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం నాడు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ కు ప్రజల నుండి నిరసన ఎదురైంది. లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యేను ప్రజలు నిలదీసినారు. భూమి ఉన్నవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎలా ఎంపిక చేస్తారని నిలదీసినారు. పథకాల జాబితాలో పేర్లు చదవాలంటు గ్రామస్తులు నిలదీయడంతో ఎమ్మెల్యే వెనుదురిగి వెళ్ళి పోయినాడు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేసినారు.