Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 25

తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లె గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం ప్రకటించిన ఐఐఐటి ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నారెడ్డి పల్లె విద్యార్థులు జి. వి.లీల నూజివీడులోను,కె.శశిప్రియ ఇడుపులపాయ లోను సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు యం బాలరాజు, పూర్వ ప్రధానో పాధ్యాయులు వై శ్రీనివాసరావు ఉపాధ్యాయులు ఒ.వి రవిశేఖర్ రెడ్డి, ఒ. నరసింహా రావు, పి. కోటిమోహన్,వి. వి. హెచ్ హేమలత,చంద్రశేఖర్ రెడ్డి,రమేష్,కిషోర్,అచ్చయ్య, వీరబ్రహ్మం విద్యార్థుల ను అభినందించారు