Listen to this article

జనం న్యూస్ 25 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన గంజాయి వ్యాపారి శెట్టి ఉమా మహేశ్వరరావు అలియాన్ హుస్సేన్ అలియాన్ పుతిన్కు చెందిన రూ.1,89,84,768/-ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 24న తెలిపారు.విశాఖపట్నంలో నివాసం ఉంటున్న శెట్టి ఉమా మహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ అలియాస్ పుతిన్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తుల సహకారంతో 147కిలోల గంజాయిని తరలిస్తుండగా రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్టు వద్ద పట్టుబడగా, ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ అలియాస్ పుతిన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించి, పిటి వారంట్ తీసుకొని తే. 25-04-2025 దిన రామభద్రపురం పోలీసులు అరెస్టు చేసారన్నారు. ఇటీవల ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణను నియంత్రించుటలో భాగంగా గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేయడంతో, చట్టపరమైన చర్యలకు ఉపక్రమించామన్నారు.
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో గంజాయి కేసుల్లో అరెస్టు కాబడిన నిందితులు, వారు ఇటీవల కాలంలో సంపాదించిన అక్రమ ఆస్తులను వెలికి తీయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు, ఒక్కొక్క గంజాయి కేసులో నిందితుల ఆస్తులపై పోలీసులు విచారణ చేపట్టారన్నారు.నిందితుడు శెట్టి ఉమామహేశ్వరరావుపై ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖపట్నం
సిటీ పరిధిలో ఏడు గంజాయి కేసులు నమోదైనట్లు, లాభసాటి వ్యాపారంగా భావించి, గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. విచారణలో భాగంగా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆధ్వర్యంలో బొబ్బిలి రూరల్ సిఐ కే.నారాయణరావు, ఎస్ఐ వి.ప్రసాదరావు మరియు ఇతర పోలీసు అధికారులు, పలు రికార్డులను, డాక్యుమెంట్లును తనిఖీ చేసి, నిందితుడు శెట్టి ఉమామహేశ్వరరావు, తన భార్య స్వరూపరాణి, సోదరుడు వెంకటరావుల పేరున 2019 నుండి 2025 మధ్య కాలంలో గంజాయి వ్యాపారంతో సంపాదించిన స్థిర, చరాస్థుల మార్కెట్ విలువ రూ.1,89,84,768/- ఉంటుందని గుర్తించా మన్నారు. గంజాయి వ్యాపారంతో సంపాదించిన అక్రమ ఆస్తులను ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ఫ్రీజ్
చేసినట్లుగా నోటీసులు కూడా జారీ చేసామన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు చెన్నైలోని కాంపింటెంట్ అధారిటీ పరిధిలోకి వెళ్ళిపోయినట్లు, సదరు ఆస్తులను ఎవరి కొనుగోలు చేసినా, చెల్లనేరవని, ప్రజలు గమనించాలని జిల్లా ఎస్పీ వరుల్ జిందల్ తెలిపారు. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, బొబ్బిలి రూరల్ సిఐ కే.నారాయణరావు, రామభద్రపురం ఎస్ఐ వి. ప్రసాదరావు మరియు ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.