

జనం న్యూస్ 25 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
నగరపాలక సంస్థ స్థలాలను ఆక్రమించి పలుచోట్ల ఇసుక, ఇటుక, పిక్క వంటి వ్యాపారాలను చేస్తున్న వారు వాటిని తక్షణమే తొలగించి వేయాలని విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు.ఈ మేరకు మంగళవారం ప్రణాళిక సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. నగరంలో సుమారు 20 ప్రాంతాలలో అనధికార ఇసుక, ఇటుక, పిక్క వంటి విక్రయాలు సాగుతున్నట్లు గుర్తించామని చెప్పారు. వాటిని రెండు రోజుల్లోగా తొలగించాలన్నారు