

జనంన్యూస్. 25.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని హుసేన్ నగర్. గ్రామానికి చెందిన. గుండెల శోభన్ కూతురు. మేఘన. అండర్ 18 ఇయర్స్, ఒకటవ బాలబాలికల జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ ఉత్తరకాండ రాష్ట్రం హరిద్వార్‌లో ఈ నెల 28 నుండి జూలై 1 .2025 ,వరకు జరిగే టోర్నమెంట్ కు నిజాంబాద్ జిల్లా . బాలికల విభాగంలో మేఘన, జాతీయ కబడ్డీ జట్టులో స్థానం సంపాదించారని, ఈనెల 11 నుండి 24 వరకు కబడ్డీ అకాడమీ బాచుపల్లి హైదరాబాద్ . లో జరిగిన శిక్షణ శిబిరంలో చక్కని ప్రతిభ కనబరిచి జాతీయ కబడ్డీ జట్టులో స్థానం సంపాదించారు. నిజాంబాద్ జిల్లా కబడ్డీ సంఘ బాధ్యులు అధ్యక్ష కార్యదర్శులు ఏ లింగయ్య. కే గంగాధర్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. మేఘనను ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర కబడి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కాశాని వీరేశం మహేందర్ రెడ్డి కి నిజాంబాద్ జిల్లా కబడి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. మేఘన జాతీయ కబడ్డీ జట్టులో స్థానం సంపాదించినందుకు తమ హర్షం వ్యక్తపరుస్తూ అభినందనలు తెలిపారు.అధ్యక్ష కార్యదర్శులు ఏ లింగయ్య. కే గంగాధర్ రెడ్డి. మరియు జాతీయ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు నిజాంబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు అభినందించారు.