Listen to this article

జనం న్యూస్ జూన్ 25 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని రైతు వేదిక లో మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 6 లక్షల రూపాయలను, 50మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 50 లక్షల 5వేల రూపాయల విలువగల చెక్కులను బీర్ పూర్ మండల రైతు వేదికలో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ . ఎమ్మెల్యే మాట్లాడుతూ..రోల్లవాగు ప్రాజెక్ట్ పూర్తికి నిరంతరం కృషి చేస్తా.అటవీ పర్యావరణ అనుమతుల విషయం లో ఆలస్యం కారణం.రాష్ట్ర ,కేంద్ర స్తాయి ఉన్నత స్థాయి అటవీ అధికారులు సువర్ణ,త్రినాథ రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది…ఎంపీ అరవింద్ దృష్టికి విషయాన్ని తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు.ఇరిగేషన్ డిఇ ఇ ఈ రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ సెక్రటరీ రవి నాయక్ ఐఏఎస్ కలిశారనీ,త్వరలో స్పష్టత వస్తుందని అన్నారు.(ఎస్ ఈఎసి ఎస్ ఈఐఎఎ )అనుమతులు కావాలని అన్నారు.కనీస పరిజ్ఞానం లేకుండా కొందరు కావాలని రోల్లవాగు ప్రాజెక్ట్ పై రాజకీయం చేస్తున్నారని,రోల్లవాగు పూర్తి కోసం, రైతులకు న్యాయం కోసం కృషి చేస్తున్నామని ప్రజలు గమనించాలని కోరారు. బీర్పూర్ మండలానికి నాణ్యమైన వైద్యం కోసం 1 కోటి 50 లక్షలతో హాస్పిటల్ నిర్మాణం. బాలికల కోసం కస్తూర్బా గాంధీ విద్యలయం మంజూరు చేయటం జరిగింది. శాశ్వత భవన నిర్మాణం కోసం త్వరలో నిధులు మంజూరు కు కృషి చేస్తానని అన్నారు బీర్ పూర్ మండలం లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తాం. రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల ను జగిత్యాలకు మంజూరుకు కృషి చేస్తాం..దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ది సంక్షేమం నిరంతరం కొనసాగుతుంది.
పాఠశాల ఏకరూప దుస్తులు మహిళ సంఘాల ఆధ్వర్యంలో రూపొందుతున్నాయి. మహిళ సంఘాల ఆర్థిక బలోపేతంకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురుకుల విద్యార్థుల కోసం నాణ్యమైన భోజనం కోసం హాస్టల్ లలో డైట్ ఛార్జీలను పెంచడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు,ఎమ్మార్వో సుజాత, ఎంపీడీవో లచ్చాలు డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, అర్ ఐ శ్రీనివాస్ ఎమ్ రాహుల్ పాక్స్ చైర్మన్ నవీన్ రావు,మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్ లు,
నాయకులు,కార్యకర్తలు,అధికారులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.