

మంచి విద్యను అందించి పదవతరగతి ఉత్తీర్ణతకు కారకులు
ఇలాంటి ఆనవాయితీ విద్యార్థి రామకృష్ణకే దక్కిందన్న గురువులు
సాదించాలనే కృషి పట్టుదల ప్రతి ఒక్కరికీ ఉండాలన్నారు
జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
విద్యా బుద్దులు చెప్పి తనను ప్రయోజకునుగా తీర్చి దిద్దిన 10వ తరగతి విద్యార్ధి రామకృష్ణ ప్రగతి స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ అంబదాస్, ప్రిన్సిపాల్ రహమత్ ఉపాధ్యాయులను బుధవారం నాడు ఘనంగా సన్మానించి కృతజ్ఞత భావాన్ని చాటి చెప్పాడు. నాకు విద్యా బుద్దులు చెప్పి మంచి భోదనతో జీవితంలో మంచి మార్గం వైపు నడవడానికి సరైన మార్గాన్ని చూపి పదవ తరగతిలో ఉత్తిర్ణత సాధించడానికి గురువులే కారణం అన్నారు విద్యార్థి. చూపించిన ప్రోత్సాహంతో భవిష్యత్తులో తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొస్తానన్నారు.ఈ సందర్బంగా గురువులు మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్ధి మమ్మల్ని గుర్తుంచుకొని సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి మంచి ఆనవాయితీ విద్యార్ధి రామకృష్ణకే దక్కుతుందన్నారు. విద్యార్ధి ఎదుగుదల గురువులకే ఆనందంగా ఉంటుందని విద్యార్థి రామకృష్ణను (2024 _ 2025వ బ్యాచ్ కు చెందిన) విద్యార్ధిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు, సామాజిక కార్యకర్త సాధక్ పాషా, పిఈటీ లక్షణ్ పాల్గొన్నారు.