

జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ ఆర్ బి పి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ , రావికంటి చంద్రశేఖర్, సామాజిక సేవలు గుర్తించి అమెరికన్ మెరిట్ కౌన్సిల్ వరల్డ్ ఛారిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాల్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో డాక్టరేట్ అవార్డు ఇచ్చి ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక సేవలు చేసిన ప్రముఖులకు డాక్టరేట్ అవార్డు తో సత్కరించడం జరిగిందని అందులో భాగంగా ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్,కు డాక్టరేట్ అవార్డుతో సన్మానం చేయడం జరిగిందని వారు రాజకీయంలో రాణిస్తూ సమాజ సేవే లక్ష్యంగా ఆర్ బి పి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సేవలను గుర్తిస్తూ ఘన సన్మానం నిర్వహించడం జరిగిందని అన్నారు, అనంతరం తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఆర్ బి పి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ, సేవే లక్ష్యంగా కొనసాగుతున్న నన్ను గుర్తించి నాకు డాక్టరేట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.