

జనం న్యూస్ జూన్ 25:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలం :ఏర్గట్ల నుండి వర్షకొండ కు పోయే రహదారి స్మశాన వాటిక దగ్గర గత కొన్ని రోజుల క్రితం గాలి దుమరా కారణం గా విద్యుత్ స్తంభం వంగిపోయింది. దీనిని ఇంకా కొన్నిరోజులు చూడనట్లయితే పంట పొలాలమీద పడిపోయే అవకాశం ఉన్నదిఅంతే కాకుండా దాని క్రింద మరొక లైన్ ఉండటం వలన చాలా ప్రమాదం జరుగుతుంది. కావున ఎప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ స్తంబాన్ని సరి చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.