

జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి దేశం లో ఎమర్జన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి అయ్యాయని పాలూరి సత్యానందం చెప్పారు. ఆనాటి చీకటి రోజులు ప్రతి ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని అన్నారు. ఈ నేపధ్యంలో అప్పటి ఎమర్జెన్సీలో సుమారు లక్షమందిని అన్యాయంగా అరెస్టు చేసారన్నారు. 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్దితిని ఉద్దేశించి అప్పటి ప్రెసిడెంట్ పక్రృధ్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా ఎమర్జెన్సీ ప్రకటించారన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ,అమయాకులను జైలుపాలు చేయడం, ఎన్నికల నిలిపివేసి పౌర హక్కుల నిలిపివేయడానికి,పత్రికలను నిలిపివేసారన్నారు.స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.