Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం జే.ఈ.వో వీర బ్రహ్మం, నందలూరు గ్రామంలో శ్రీ సౌమ్య నాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంలో జే. ఈ.వో రావడం జరిగినది,గుడిలో ఎద్దుల సుబ్బరాయుడు ఆర్టిసి జోనల్ మాజీ చైర్మన్ తిరుమల తిరుపతి జే.ఈ.వో వీరబ్రహ్మం ని సన్మానించడం జరిగినది,అందులో భాగంగా గుడికి సంబంధించిన బ్రహ్మోత్స వాలు జులై మొదటి వారం 4 వ తేదీన నుంచి జరుగునకు ఏర్పాట్లు, చర్చించడం జరిగినది పలు సమస్యలు జే.ఈ వో కి సుబ్బరాయుడు తెలియజేయడమైనది, సానుకూలంగా స్పందించడం జరిగినది,ఈ బ్రహ్మోత్స వాలలో లైటింగ్ డెకరేషన్ కూడా ఇటు అరవపల్లి వరకు హైవే రోడ్డు లోని ఇరువైపులా నందలూరు సరిహద్దుల వరకు లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో స్థానికులు గంట వాసు దేవయ్య, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్,ట్రస్ట్ కోశాధికారి చక్రాల రామ సుబ్బన్న,మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ పల్లె సుబ్రహ్మణ్యం, టిడిపి పార్టీ అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, నందలూరు సర్పంచ్ రాము, చక్రాల సాయినాథ్, ట్రస్ట్ సభ్యులు సుబ్బరామయ్య, వంశీ, వరదయ్య,గుండు మున్నయ్య, రాకేష్ తదితరులు పాల్గొన్నారు