

జనం న్యూస్ :25;,జూన్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగ అధిపతిగా మరియు పరీక్షల నియంత్రణ అధికారిగా సేవలందిస్తున్న కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల సుదర్శనం రాష్ట్ర స్థాయి ఉత్తమ పరిశోధకుడు అవార్డును అందుకున్నారు. నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వ విద్యాలయంలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కామర్స్ అసోసియేషన్ 6 వ వార్షిక సమావేశంలో, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిస్టా రెడ్డి, తెలంగాణ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి రావు మరియు వివిధ విశ్వ విద్యాలయాల రిజిస్ట్రార్ ల చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందుకోవడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో విద్యా విషయక, పరిశోధన, పుస్తకాల ప్రచురణ, సెమినార్లు – సదస్సులలో భాగస్వామ్యం, మరియు విద్యార్థీ కేంద్రంగా నిర్వహించే సృజనాత్మక కార్యక్రమాలు ఆధారంగా రాష్ట్రంలోని కామర్స్ ఆచార్యులలో ఎక్కువ సామర్ధ్యాలను, ప్రతిభను ప్రదర్శించిన ఒక్కరికి ఈ అవార్డును ప్రధానం చేస్తున్నారు. స్వర్గీయ ప్రొఫెసర్ ఎచ్. వెంకటేశ్వర్లు, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్మారకార్థం ఈ సంవత్సరం నుండే ప్రారంభించిన ఈ అవార్డు కు మొట్ట మొదటిసారిగా డాక్టర్ గోపాల సుదర్శనం ఎంపిక కావడం చాలా అభినందనీయమని వారి ద్వారా కళాశాలకు దక్కిన గౌరవం అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పేర్కొంటూ, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందంతో కలసి గోపాల సుదర్శనం అభినందించి, సన్మానించారు.గత విద్యా సంవత్సరంలో తాను రచించిన రెండు పుస్తకాలు, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైన మూడు పరిశోధనా పత్రాలు, ఐ సి ఎస్ ఎస్ ఆర్ మరియు టీజీ సిహెచ్ ఈ తెలంగాణ సౌజన్యంతో నిర్వహించిన జాతీయ సదస్సులు, కార్యశాలలు మరియు తాను చేపట్టిన ఐ సి టి ఆధారిత బోధన, విద్యార్థుల్లో ప్రాజెక్టుల తయారు మెళుకువలను నేర్పడం, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బోధించిన విస్తరణ ఉపన్యాసాలు మొదలగు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అత్యున్నత రాష్ట్ర స్థాయి అవార్డుకు తనను ఎంపిక చేయడం జరిగిందని, అందులో భాగంగా, మెమెంటో, అభినందన సర్టిఫికెట్, శాలవతో పాటూ 5000 ల రూపాయల నగదు పురస్కారాన్ని ఈ సందర్భంగా అందించారని తెలుపుతూ, ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేసిన టి. సి. ఏ రాష్ట్ర కమిటీ కీ కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ గోపాల సుదర్శనం.