

జనం న్యూస్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో సిపిఎం మండల, పట్టణ కమిటీల సమావేశం సూదగాని సత్య రాజయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన ఇండ్లు ఇళ్ల స్థలాలు రైతు ఆత్మీయ భరోసా లాంటి లబ్ధిదారుల ఎంపికను గ్రామ, వార్డు సభల ద్వారానే ఎంపిక చేయాలని అలా కాకుండా ప్రజలతో సంబంధం లేకుండా అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో లబ్ధిదారులు ఎంపిక జరిగితే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి జరిగిన గుణపాఠం కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగును అని హెచ్చరించారు. కౌలు రైతులకు ఆత్మీయ భరోసా ఇస్తామని ప్రభుత్వం గతంలో ఎన్నికలు హామీ ఇచ్చిందని హామీ ఇప్పటికి నెరవేర్చలేదని రైతు భరోసా తో సమానంగా ఆత్మీయ భరోసా ఇవ్వాలని ప్రాంతానికి సాగు త్రాగునీరు అందించే ప్రాజెక్టులను చేపట్టి ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి ఎమ్మెల్యే తమ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం జిల్లా నాయకులు బోలగాని జయరాములు ఎంఏ ఇక్బాల్ మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు