

జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు శాయంపేట మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ
మండల కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బడిబాట కార్యక్రమం పిలుపుమేరకు మండల కేంద్రంలోని బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా వాటిని ఎంఈఓ కార్యాలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో వినతి పత్రం రూపంలో కంప్యూటర్ ఆపరేటర్ మామిడి రజిత కి పలు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో గోడలకు పెచ్చులు ఊడిపోయి శిధిలావస్థకు చేరుకున్నాయి వాటిని పునర్మించాలని కంప్యూటర్ క్లాసులు చెప్పాలని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో కొత్త బెంచీలను ఏర్పాటు చేయాలి విద్యార్థులు ఆడుకోవడానికి ఆటస్థలం ఏర్పాటు చేయాలి కోతుల సమస్యల నుండి విముక్తి కల్పించాలి కంప్యూటర్ క్లాస్ లను నేర్పించాలి మండల కేంద్రంలో రెండు ప్రభుత్వ బాల బాలికల పాఠశాల లు ఎందుకని విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నందున ఒకే దగ్గర తరగతులు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కూతాటి రమేష్ బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు పురాణం చంద్రశేఖర్ బిఆర్ఎస్ జిల్లా నాయకులు అంబాటి అఖిల్ తదితరులు పాల్గొన్నారు…..