Listen to this article

గిద్దలూరు మండల ప్రతినిధి, జూన్ 26 (జనం న్యూస్):

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జాయింట్ సెక్రటరీగా గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జనరల్ సెక్రటరీగా నియామకం చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు, నాపై నమ్మకంతో నన్ను సిఫార్సు చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కేపీ.నాగార్జున రెడ్డి కి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వంశీధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.