

జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండల భారతీయ బౌద్ధమసభ, అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం
జేత్వాన్ బుద్ధ విహార్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దుర్గం దుర్గాజి, ప్రధాన కార్యదర్శిగా ఉప్రే విజయ్ లు ఎన్నికగాక, సమాజ అధ్యక్షులుగా శ్యామ్ రావు లహుజి దుర్గే, రాజేశ్వర్ ఉప్రే లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వీరందరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. జులై 10 నుండి ప్రారంభమయ్యే వర్ష వాస్ కార్యక్రమాన్ని అందరు కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు.జూలై 10న వాంకిడి మండల కేంద్రంలో బుద్ధునితో ప్రయాణం అనే తెలుగు నాటికను వర్ష వాస్ కార్యక్రమం ప్రారంభ రోజు ప్రదర్శించనున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధమహసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్,మరియు తదితరులు పాల్గొన్నారు.

