

వెలిశాల క్రిష్ణమాచారి సిఐటియు జిల్లా కమిటి సభ్యులు
జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సూపరిడెంట్ రమణాచారి కి 2025 జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొంటారని తెలియజేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్.అందజేశాము అని తెలిపారు. ఈ సంధర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోట్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు, కార్మిక హక్కులు హరించబడతాయి. జీతాల పెంపుదలకు, కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి బలహీనపడుతుంది. ఉద్యోగ భద్రత, ఉపాధికి గ్యారంటీ లేకుండా పోతుంది.దేశంలోని పరిస్థితినంతటినీ సమీక్ష చేసిన కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు 2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని. అన్నారు. కార్మికుల్ని బానిసత్వంలోకి నెట్టే లేబర్ కోడ్లను రద్దు చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లు నిర్ణయించి అమలు చేయాలి. మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలి. ప్రభుత్వరంగ సంస్థల వాటాలు అమ్మడం, ప్రైవేట్ పరం చేయడం ఆపాలి. కేంద్ర స్కీమ్లకు బడ్జెట్ తగ్గించొద్దు, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి. అన్నిరకాల ఆహార వస్తువులపై జిఎస్ టిని ఉపసంహరించాలి. గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి. అవసరమైన గ్యాస్ను సబ్సిడీకి ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రోసిడింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అక్రమ తొలగింపులు అరికట్టాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌళిక వసతులు కల్పించాలి. కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి. సామాజిక భద్రత కల్పించాలి. ప్రమాద బీమా, పిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యం కల్పించాలని. డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా నాయకులు మడావి చంద్రకళ, మారినేని సునీతా, అడ మోతూబాయి,లు పాల్గొన్నారు.