

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
నేటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం
జనం న్యూస్, జూన్ 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం సంవత్సరంలో నాల్గవ మాసం. చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటంవల్ల ఈ మాసానికి ఆషాడం అని పేరు వచ్చిందన్నారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్బంగా రామకోటి కార్యాలయంలో మాట్లాడుతూ ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢం అనంతకోటి పుణ్య ఫలితాలను అందించే మాసంగా పేరొందిందన్నారు. ఈ మాసం అమ్మ ఆరాధనకు శ్రేష్ఠమైనదన్నారు. గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో గురువారం మొదటి బోనాల వేడుకలు ఆరంభమౌతాయి. ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారన్నారు.తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతరను ఘనంగా జరుపుతారు. దీనినే ‘బోనాల పండుగ’, ‘ఆషాఢ జాతర’గా పిలుస్తారు. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ. తొలి ఏకాదశి, చాతుర్మాసదీక్ష, గురుపూర్ణిమ, దక్షిణాన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నెలవు ఈ ఆషాఢమాసం అన్నారు. మనం కూడా ఆచారాలు పాటిద్దాం. పూజాఫలం పొందుదాం అన్నారు.