

జనం న్యూస్ జూన్26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారి ఆదేశాల మేరకు షీ టీం ఆసిఫాబాద్ సిబ్బంది డ్రగ్ అవేర్నెస్ పైన ఆసిఫాబాద్ లోని సెయింట్ మేరీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పలు లఘు చిత్రాలతో పిల్లలను ఆకర్షిస్తూ వాళ్లకి డ్రగ్ అవేర్నెస్ అలాగే ఎన్.డి.పి.ఎస్ ఆక్ట్ పైన అవగాహన కల్పించడం జరిగింది. ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినట్లయితే వారికి పడే శిక్షల పైన చట్టాల గురించి మరియు నూతన చట్టాల గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, షీ టీం సిబ్బంది స్వప్న, రజిని, దినేష్ పాల్గొన్నారు మహిళలు, విద్యార్థినిలు ఆకతాయిల వేధింపులకు గురైతే డయల్ 100కు గానీ షీటీ మ్ నంబర్ 8712670564 కు గానీ ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెస్సేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలని వివరించారు.
