

ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,జూన్26,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యా ర్ధుల చేతుల్లోనే ఉందని,అందుకు విద్యార్థులంతా నడుం బిగించాలని మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై భావి తరాలకు మంచి భవిష్యత్ అందించాలన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపడం జరిగింది అని,గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చామని,వైసీపీ హయాంలో మారుమూల ప్రాంతాల్లోని బడ్డీకొట్లలో సైతం గంజాయి, డ్రగ్స్ దొరికేవని,పొరపాటున మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. గంజాయి పండించే వారికి ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా ఇచ్చేవారని,గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని,విలువైన జీవితమే ముద్దు, డ్రగ్స్ వద్దు బ్రో అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరవాడ డిఎస్పి స్వరూప్, ఎస్సైలు, సీఐలు ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది,విద్యార్థులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
