Listen to this article

జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎం.ఎస్.ఎన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఒంగోలులో జరిగిన 36వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గ ఎంపిక జరిగింది.ఈ ఎంపిక ప్రక్రియలో విజయనగరం జిల్లాకు చెందిన ఎం.ఎస్.ఎన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజుకు ఐజేయు,ఏ పి యు డబ్ల్యు జే రాష్ట్ర నాయకులు, విజయనగరం జిల్లా ప్రతినిధులు దిమిలి అచ్యుతరావు, పి.ఎస్. ఎస్. వి. ప్రసాద్, జరజాపు శేషగిరిరావు, టి.రాధాకృష్ణ,వెంకటేశ్వర మహాపాత్రో,ఎన్. సన్యాసిరావు లతోపాటు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు కేజే శర్మ, కార్యదర్శి సముద్రాల నాగరాజు అభినందనలు తెలిపారు.