Listen to this article

కురిమెళ్ళ శంకర్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు

జనం న్యూస్ 27జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గ )

స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 42% కి పెంచుతూ టీజీ ప్రభుత్వం వెంటనే జీవోను జారీ చేయాలని,జారీ చేసిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము 73,74 రాజ్యాంగసవరణల ప్రకారం,ఆర్టికల్ 243 D ,243 T ల ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుకోవటానికి రాజ్యాంగం ఇదివరకే అవకాశం కల్పించిందని,తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం,201,క్లాజు ప్రకారం,బిసి కులగణన రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 42% శాతానికి పెంచుతూ జీవోను జారీ చేసుకునే అధికారాన్ని రాజ్యాంగమే కల్పించింది.ఎవరైనా కోర్టుకు వెళితే బిసి కులగణన రిపోర్ట్ లెక్కలను సమర్పించాలి.అలా కాకుండా 9 వ షెడ్యూల్డులో చేర్చాలని డ్రామాలు చేయటం మానుకోవాలి బిసిలను మోసం చేయటానికి కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు చేస్తే తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు కురిమెల్ల శంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు