

అర్ధవీడు ప్రతినిధి, జూన్ 27 (జనం న్యూస్):
ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ వెంకట్రావు, ఇంచార్జీ ఎంపీడీవో నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ మేడూరి వెంకట్రావు, జడ్పీటీసీ చెన్ను విజయ, మాజీ ఎంపీపీ నన్నెబోయిన రవికుమార్ యాదవ్ హాజరయ్యారు. అర్ధవీడు మండలంలోని ప్రజా సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్చించారు. అర్ధవీడు మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎంపీపీ వెంకటరావు అన్నారు. అలాగే మాజీ ఎంపీపీ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ స్మశాన వాటిక గురించి చర్చించారు. స్మశాన వాటిక కకు హద్దులు మరియు దారి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మండలంలోని ముఖ్యంగా గన్నేపల్లి, వెలగలపాయ ఇలాకాలో వున్న గత 50 సంవత్సరాల నుండి రైతులు సాగు చేసుకుంటున్న భూములకు అర్హులైన వారికి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు. మండలం లోని కుంటలు చెరువులు అన్నింటికీ హద్దులు చూపించాలని కోరారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే కాలం కావడంతో గ్రామీణ ప్రాంతాలలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంచార్జీ ఎంపీడీవో నరేష్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి వుండగా చాలా మంది అధికారులు గైర్హాజరు అయ్యారు. అర్ధవీడు లో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అని సర్పంచ్ “మునగాల వసంత” సర్వసభ్య సమావేశంలో అధికారులపై ఆమె ధ్వజమెత్తారు.
