

జనం న్యూస్- జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలోని ఎనిమిదవ వార్డులో ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన వార్డు సభలో కౌన్సిలర్ తిరుమల కొండ అన్నపూర్ణ పాల్గొన్నారు ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు, అర్హులందరూ రేషన్ కార్డుకు మరియు ఇందిరమ్మ నివాస గృహాలకు దరఖాస్తు చేసుకోవాలని, జాబితాలో పేరు లేని వారెవరు అధైర్య పడద్దని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆమె ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మరియు నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణ, నందికొండ మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ జయరాజ్, ఉమా శంకర్ ,మరియు మున్సిపల్ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు