

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టెల సైదుబాబు…
జనం న్యూస్ 27జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం )
భర్త చేతిలో మోసపోయిన ఒక ఆడబిడ్డ కు న్యాయం చేయాలని భావించి, తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భర్త బంధువులను కౌన్సిలింగ్ కు పిలిస్తే కౌన్సిలింగ్ కు వచ్చిన వారిపట్ల దురుసుగా ప్రవర్తించారని ఎటువంటి ఆధారాలు లేకుండా, ఏ చిన్న ఆరోపణలు లేకుండా నిజాయితీ గల ఇల్లందు సీఐ గారిని సస్పెండ్ చేయడం చాలా దారుణం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టెల సైదుబాబు స్పష్టం చేశారు.న్యాయం కోసం ఆశ్రయించే మహిళల పట్ల పోలీసు ఉన్నతాధికా రులకు మోసపోయిన మహిళకు న్యాయం చేయకపోగా ఒక మోసగాడిని సపోర్ట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికా రులు. భద్రాద్రి జిల్లాలో కేసుల విషయంలో మహిళాల విషయంలో ఎక్కడ పొరపాటు చేసిన దాఖలాలు లేవని, ప్రజలతో ప్రెండ్లీ పోలీసింగ్ గల వ్యక్తి అని,ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎంత మాత్రం సరి కాదని కావాలని బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులపై ఒత్తిడిని తీసుకొచ్చి సస్పెన్షన్ చేయడాన్ని ఖండిస్తూ వెంటనే సస్పెన్స్ ఎత్తివేయాలి….