Listen to this article

జనం న్యూస్ జూన్ 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల వసతి గృహంలో బీజెడ్సీ సెంకండ్ ఇయర్ చదువుతోన్న కుమ్మరి స్వప్న (19) అనే విద్యార్థిని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వసతి గృహం భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించిన ఘటణపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్ పక్షాణ డిమాండ్ చేస్తున్నాము.మంచిర‌్యాల గురుకుల డిగ్రీ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి.గత ఎప్రిల్ నెలలో కూడా ఇదే కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.రెండు నెలలు గడవకముందే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం చూస్తుంటే యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టం అవుతోంది.రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గురుకులాలు అద్దె బిల్డింగులలో కొనసాగుతుండగా వాటిలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు.సరైన పౌష్టికాహారం,మంచినీరు,వైద్య సదుపాయాలు అందించడం లేదు.సైకాలజిస్టులు అందుబాటులో లేరు.విద్యార్థులు సమస్యలతో కుంగుబాటుకు గురౌతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు పక్కా బిల్డింగులు నిర్మించడంతో పాటు మౌళిక సదుపాయాలు మెరుగు పర్చాలి.విద్యార్థిని కుమ్మరి లక్ష్మీ మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు జరపి కుటుంబానికి న్యాయం చేయాలి.విద్యార్థి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మంజూరు చేయాలని ప్రొగ్రస్సివ్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో,సంక్షేమ హాస్టళ్లలో ఆత్మహత్యల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము