

జనం న్యూస్ జూన్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిడ్జ్ ఫెసిలియస్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ ఏజెన్సీ” గాజులరామారం పరిధిలోని లో నాదిష్ అనే కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి సెక్యూరిటీ సూపర్వైజర్ గా పనిచేసేవారు, కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ ఏజెన్సీ లో సెక్యూరిటీ సూపర్వైజర్ గా మానేయడం జరిగింది… నాదిష్ అనే కార్మికుడికి ఈ ఈ సంవత్సరం మార్చ్ నెల వేతనం ఇరవై నాలుగు వేల రూపాయలు రావాల్సి ఉండగా అవి ఇవ్వకపో వడంతో పలుమార్లు కంపెనీ యజమాన్యాన్ని ఎన్నిసార్లు అడిగినా నాదిష్ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తనను ఏదో రకంగా కంపెనీ యజమాన్యం పట్టించుకోవడం లేదు అని తెలుసుకొని అడిగి విసుగు చెందిన సెక్యూరిటీ కార్మికుడు నాదిష్ తనకు ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే కార్మికులకు న్యాయం చేస్తారని తోటి సెక్యూరిటి కార్మిక మిత్రుల ద్వారా తెలుసుకొని, బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి గురించి తెలుసుకొని తన కార్యాలయం వద్దకు వచ్చి తనకు జరిగిన కోసం డబ్బు కోసం అన్యాయం గురించి వివరించారు.. వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి హుటాహుటిన మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ ఏజెన్సీ వద్దకు బయలుదేరి యజమాన్యంతో పలుమార్లు చర్చించి కార్మికుడికి నాదిష్ కి రావలసిన వేత్తనం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇప్పించడం జరిగింది… కార్మికుడు నాదిష్, మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు…