

జనం న్యూస్ 27-6-25 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారు ఇక్కడ వచ్చిఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జీవితంలో రెండు దానం గొప్పది 1. రక్తదానం 2. అన్నదానం మొదటిది కడుపు నింపేతే మనిషి రెండవది సాటి మనిషి ప్రాణాలను నిలబడుతుంది. గురువారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో ఎస్బిఐ బ్యాంకు ముంగట నిర్వహించారు ఇందులో దాదాపు 86 మంది వరకు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు
ఇందులో బ్యాంకు మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ ప్రజలు విద్యార్థులు అందరూ ముందుకు రావడం అభినందనీయం అన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ సిబ్బంది, జోగిపేట కు చెందిన సిరి సంపద విలేకర్ పవన్ సింగ్, బ్యాంకు సిబ్బంది, జోగిపేట పట్టణ అనిల్ కుమార్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.