Listen to this article

జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

భారత దేశంలోనే మొట్టమొదటి మిషన్ వాత్సల్య – పిఎం బాల సంరక్షణ యోజన(పిఎం కేర్) చెక్కును రాజమహేంద్రవరంలో అందజేశారు. కోవిడ్ సమయంలో తల్లితండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాల లోపు చిన్నారు లకు  రూ.10 లక్షల ఆర్థిక  సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోది ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, లబ్ధిదారుకు 23 సంవత్సరాలు నిండిన తరువాత  అందచేస్తుంది. అందులో భాగంగా భారత దేశం లోనే మొట్ట మొదటి పీఎం బాల సంరక్షణ (పీఎం కేర్ )చెక్కును తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, దొమ్మేరు కు చెందిన ప్రత్తిపాటి సునియా సుమా మణి  అందుకున్నారు. స్థానిక పోలీస్ కళ్యాణ మండపం లో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి చేతుల మీదుగా నగదు చెల్లింపు పత్రాలు అందుకున్నారు.