

ఎకరాల భూమి ఉన్నోడు పేదోడ భూమి గుడిసె లేనోడు పేదోడ
(జనం న్యూస్ జూన్ 27 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండల గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను గ్రామస్తులు ఎన్నుకోకుండా ఎవరి ఇష్ట ప్రకారం వారే ఎన్నిక చేసుకోవడం జరిగిందని గ్రామస్తులందరి అనుమతితో ఎన్నుక చేయబడినది గ్రామ కమిటీ అంటారు కానీఎవరికి సమాచారం లేకుండా ఎవరికి వాళ్లే కమిటీ లు అనుకొని ఇండ్లు లేని నిరుపేదలకు పూర్తిగా అన్యాయం చేశారని గ్రామస్తులు ఆరోపించారు, డొక్కా నిండని పరిస్థితులు పూరి గుడిసెల్లో పాములు తేళ్లు వర్షపు నీళ్లలో నిద్రపోతున్నారు అయినా అధికారులు ప్రజా పాలకులు పట్టించుకోకుండా నాయకులు నిర్లక్ష్యం వహించారని ఈ విధంగా ఉంటే అధికార పార్టీకి పెద్ద నష్టం తప్పదని ప్రజా ప్రతినిధులుఆలోచించాలి పేద వాళ్లకి తక్షణమే ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని రేపు మాపు అని వాయిదాలు వేయకుండా పేదవాడికి ఇల్లు అందే వరకు ఇంతకుముందు పేర్లను తొలగించి ఎవరైనా అక్రమాలకు పాల్పడిన గ్రామ కమిటీలపై చర్యలు తీసుకొని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు చెందే విధంగా సహకరించి పంపిణీ జరగాలని పేద ప్రజలందరికీ న్యాయం చేయాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అసలు అంతర్గతంగా ఏం జరిగింది? లిస్టులు ఎందుకు మారాయి కమిటీ సభ్యులు నిర్ణయిచిన పేర్లు లిస్ట్లో ఎందుకు లేవు ప్రజలలో ఆలోచన మొదలైంది