Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- మండల కేంద్రమైన నాదెండ్ల లోని కస్తూరి బాలికల పాఠశాలలో శుక్రవారం స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (గార్డ్స్) ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు (ఏ.జి.పి) దాసరి చిట్టిబాబు పాల్గొని మాట్లాడారు. బాలికను కాపాడుకోవడం సమాజ బాధ్యత అన్నారు..ఆడపిల్లను పుట్టనిద్దాం, ఏదగనిద్దాం, చదవనిద్ధాం, కాపాడుకుందాం అన్నారు. బాలికలకు హక్కులున్నాయన్నారు. వాటితోపాటు బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. ఆడపిల్ల చదువు ఇంటికి మాత్రమే కాదు సమాజానికే వెలుగు అన్నారు. ఇందులో భాగంగా జనవిజ్ఞాన వేదిక ప్రచురించిన ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవాలి అనే పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గార్డ్స్ ఉపాధ్యక్షులు గే రా యాకోబు, కార్యదర్శి పొనుగుబాటి బుల్లి బాబు, సభ్యులు వద్లన చంద్రం, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి దార్ల బుజ్జిబాబు, ధూళిపాళ శ్రీనివాసరావు, షేక్ బాజీ, తోపాటు పాఠశాల ఇంచార్జీ ప్రత్యేక అధికారిని రత్నకుమారి తదితరులున్నారు.