Listen to this article

జనం న్యూస్ 28జూన్ పెగడపల్లి ప్రతినిధి.


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని పలు ఎరువుల దుకాణాలను మరియు సొసైటీలలో తనిఖీలలో భాగంగా ఎరువులను రైతులకు ఈ పాస్ ద్వారా మాత్రమే ఇవ్వాలనిసూచించడం జరిగింది. రైతులు ఎరువు బస్తాలు కొనుగోలు చేసి మరియు అదేవిధంగా బిల్లులు తీసుకోవాలని తెలిపారు. ఏ రోజు స్టాకు ఆ రోజు రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి డీలరు ఈపాస్ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి వి.భాస్కర్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, సీఈవో గోపాల్ రెడ్డి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.