Listen to this article

జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్న కుండలేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న బొబ్బర్లంక, పల్లంకురు ప్రధాన పంట కాలువలోని చెత్తను శుక్రవారం తొలగించారు. కథ కొన్ని రోజులుగా చెత్త నిలవ ఉండడంతో పాటు జంతు మృతదేహాలు కూడా ఇక్కడ చిక్కుకుపోవడంతో దుర్వాసన వెదజల్లింది. దీంతో స్నాన ఘట్టంలో భక్తులు స్నానాలు చేయడానికి ఇబ్బంది పడ్డారు. స్థానికులు కూడా ఈ దుర్వాసనను భరించలేకపోయారు. కాట్రేనికోన మండల వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు ఆకాశం శ్రీనివాస్ స్పందించారు. ఆయన ఆధ్వర్యంలోశుక్రవారం చెత్తను తొలగించారు. దీంతో గ్రామస్తులతో పాటు భక్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు.