

జనం న్యూస్ జూన్ 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని శుక్రవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి బస్ స్టాండ్ వద్ద ఏఎస్సై పోశేట్టి పోలీస్ సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 250 దేశిదారు మద్యం(90ML) సీసాలను గుర్తించి పట్టుకున్నారు. మార్కెట్లో దేశిదారు మద్యం బాటిల్స్ విలువ సుమారు రూ.12,500 విలువ ఉంటుందని తెలిపారు.గడ్చిరోలి జిల్లా సిరోంచకు చెందిన మరగోని కృష్ణామూర్తి గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.