Listen to this article

నగరంలో ఊరేగింపుగా శ్రీ జగన్నాథ రథయాత్ర

జనం న్యూస్ నిజామాబాద్ మండల ప్రతినిధి జూన్ 28:- ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని అదే విధంగా ప్రతి సంవత్సరం నిజామాబాద్ లోని ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఈసారి కూడా 8వ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ఇస్కాన్ మందిరము కేంద్ర శాఖ హైదరాబాద్ సహకారంతో మరియు నిజామాబాద్ నగరంలోని ఇస్కాన్ మందిరం వారు జూన్ నెల 20వ తేదీ నుండి జూన్ 27వ తేదీ వరకు వైభవంగా ఎనిమిదవ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అని ఇస్కాన్ నిజామాబాద్ ప్రముఖులు సిద్ధ బలరాం జనం న్యూస్ కి వెల్లడించారు ఇందు కొరకు నిజామాబాద్ నగరంలోని స్థానిక కిసాన్గంజ్ ప్రాంగణమునందు క్లాక్ టవర్ ప్రక్కన ఒరిస్సాలోని పూరీ జగన్నాథ మందిరము వలె కట్టెలు మరియు ఇనుప వస్తువులతో ఒక భారీ గోపురం తో పాటు చెక్కతో చేసిన శ్రీ జగన్నాథ స్వామి, సుభద్రమాయి, మరియు బలరాముడు యొక్క విగ్రహ మూర్తులను ప్రతిష్టించి ఒక తాత్కాలికమైన ఒక మందిరమును ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్మించడము జరిగింది, ఇందులో జూన్ నెల 20వ తేదీ నుండి, జూన్ నెల 27వ తేదీ వరకు ప్రతిరోజు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను, మరియు ఇస్కాన్ కేంద్ర శాఖ హైదరాబాద్ నుండి వచ్చినా ప్రముఖ గురువుల ప్రవచనాలతోపాటు ఇస్కాన్ శాఖ నవి ముంబై ఉపాధ్యక్షులు మరియు ఇస్కాన్ గ్రంథ తెలుగు అనువాదకులు వైష్ణవాంగ్రి సేవక్ దాస్ గురువు ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు ఈ యొక్క జగన్నాథ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాలను కూడా ఇస్కాన్ నిజామాబాద్ శాఖ వారు ఏర్పాటు చేసినారు. ఈ యొక్క ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనిమిదవ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాలలో భాగంగా, జూన్ 20వ తేదీ రోజు ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలను సాయంత్రము 5 గంటలకు ప్రారంభించారు దాంతోపాటే భాగవత గ్రంథాన్ని ఆవిష్కరించారు, అదే రోజు సాయంత్రము 7 గంటలకు తెలుగులో భాగవత కథ ప్రవచనము భజన కీర్తన విశేష దర్శన, చెప్పన్ బోగ్, మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి, జూన్ 21 రోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు భాగవత కథ ప్రవచనము హిందీలో నిర్వహించారని ఆ తర్వాత విశేష దర్శన ప్రసాద వితరణ మరియు సాయంత్రము ఏడు గంటల నుండి భాగవత కథ ప్రవచనం తెలుగులో చందనాభిషేకము మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలు, జూన్ 22 ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుండి ఉదయం 9 గంటలకు శ్రీమద్ భాగవత సప్తాహ కథ ప్రవచనము హిందీలో మరియు సాయంత్రం ఏడు గంటలకు శ్రీమద్ భాగవత కథ ప్రవచనం తెలుగులో పల్లకి సేవ ఇంకా ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించామని అదేవిధంగా జూన్ 23 సోమవారం ఉదయం 8 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు భాగవత కథ ప్రవచనము హిందీలో మరియు సాయంత్రం ఏడు గంటలకు భాగవత కథ ప్రవచనం తెలుగులో మరియు ఆ జగన్నాథ ప్రభువుల వారికి ఉంజల సేవ ఇంకా ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఇస్కాన్ నిజామాబాద్ శాఖ బాధ్యులు. సిద్ధ బలరాం గురూజీ జనం న్యూస్ తో వెల్లడించారు, అదేవిధంగా జూన్ 20వ తేదీ నుండి ప్రతిరోజు జరిగే శ్రీమద్ భాగవత కథ ప్రవచనము తో పాటు ప్రత్యేకంగా జూన్ 24 రోజు పుష్పాభిషేకము జూన్ 25వ రోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు జూన్ 26వ తేదీ బుధవారము రోజు ఉదయము 11 గంటలకు యజ్ఞము మరియు సాయంత్రము 7 గంటలకు పంచామృత అభిషేకము వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఇస్కాన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఇందులో ప్రతిరోజు అధిక సంఖ్యలో నిజామాబాద్ నగరానికి చెందిన భక్తులే కాకుండా నిజాంబాద్ జిల్లాలో నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ యొక్క 8వ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క జగన్నాథ ప్రభువు సుభద్రమై మరియు బలదేవుని దర్శించుకున్న భక్తులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని, అదేవిధంగా ఈ యొక్క ఎనిమిదవ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తులందరికీ ఆ యొక్క జగన్నాథ ప్రభువుల కరుణాకటాక్షాలు కలగాలని ఇస్కాన్ నిజామాబాద్ తరపున భక్తులకు తమ ఆశీస్సులు అందజేస్తున్నట్లు ఇస్కాన్ నిజామాబాద్ శాఖ ప్రముఖులు సిద్ధ బలరాం గురూజీ జనం న్యూస్ కి తెలిపారు. ఇంకా ఈ సందర్భంగా సిద్ధ బలరాం గురూజీ మాట్లాడుతూ జూన్ నెల 27వ తేదీ శుక్రవారం రోజు ఉదయము 9 గంటలకు హిందీలో శ్రీ భాగవత కథ ప్రవచనము ఉంటుందని ఉదయం 11 గంటల నుండి భక్తులకు మహా అన్నదాన కార్యక్రమము ఉంటుందని అదేవిధంగా మధ్యాహ్నము ఒకటి గంటల నుండి శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమము పాతగంజ్ క్లాక్ టవర్ నుండి రథయాత్ర ప్రారంభమై నిజామాబాదు నగరంలోని గాంధీ చౌక్ శివాజీ నగర్ చౌరస్తా పులాంగ్ చౌరస్తా ఎల్లమ్మ గుట్ట చౌరస్తా జిల్లా కోర్టు రోడ్డు తిలక్ గార్డెన్ దేవీ రోడ్డు రాజస్థాన్ భవన్ మీదుగా వెళ్లి చివరకు సాయంత్రము 6 గంటలకు తిరిగి అదే పాతగంజ్ క్లాక్ టవర్ కి చేరుతుందని ఆ తర్వాత ఆ ప్రాంతంలో రాత్రి 10 గంటల వరకు వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇస్కాన్ నిజామాబాద్ మందిరం ప్రముఖులు సిద్ధ బలరాం గురూజీ ఈ సందర్భంగా జనం న్యూస్ కి తెలిపారు. అదేవిధంగా జూన్ 27వ తేదీ రోజు నిజామాబాద్ నగరంలో అంతిమంగా నిర్వహించే శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందగలరని మరియు ఎవరైతే ఈ యొక్క రథయాత్ర లోని రథంపై ఆసీనులై ఉన్న శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నట్లయితే వారికి ఇక పునర్జన్మ ఉండదని బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిందని కావున భక్తులందరూ అధిక సంఖ్యలో శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క జగన్నాథ ప్రభువుల వారి ఆశీస్సులు పొందగలరని సిద్ధ బలరాం జనం న్యూస్ తో పేర్కొన్నారు.